Friday, July 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబులెన్స్ లో ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం 

అంబులెన్స్ లో ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం 

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్ : మండలానికి చెందిన లక్ష్మీకి 9 నెలలు నిండడంతో నిజాంసాగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాన్పు కోసం వచ్చింది. అక్కడ ఉన్న డాక్టర్లు ఆమె రిపోర్టులను పరిశీలించి, శిశువు మెడకు పేగు చుట్టుకుని ఉందని తెలిపారు. సురక్షితమైన ప్రసవం కోసం బాన్సువాడ మాత శిశు కేంద్రానికి రిఫార్ చేశారు. ఈ క్రమంలో పేషంట్ ను అంబులెన్స్ లో బాన్సువాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో గర్బిణీకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో నర్వ గేటు సమీపంలో అంబులెన్స్ లోనే క్లిష్ట పరిస్థితుల మధ్య లక్ష్మికి అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారు. అనంతరం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుఖ ప్రసవం చేసిన సందర్బంగా టెక్నీషియన్ అరవింద్, అంబులెన్స్ పైలట్ వెంకటేష్ ను కుటుంబీకులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -