– మారుతి సుజుకి కొత్త రికార్డ్
నవతెలంగాణ-హైదరాబాద్
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి హైదరాబాద్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఒకే రోజు 108 ఇ-విటారా యూనిట్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. దేశంలోనే అత్యధికంగా 14.5 శాతం ఈవీ వినియోగం ఉన్న హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఈ సరికొత్త ఇ-విటారా సింగిల్ ఛార్జ్‌తో 543 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుండగా, భద్రతలో 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. వినియోగదారులను ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి ఏడాది పాటు ఉచిత ఛార్జింగ్‌తో పాటు రూ. 50,000 విలువైన హోమ్ó చార్జర్, ఇన్‌స్టాలేషన్‌ను ఉచితంగా అందిస్తోంది. 2031 నాటికి మరో నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది.
ఒకే రోజు 108 ఇ-విటారా కార్ల డెలివరీ
- Advertisement -
- Advertisement -



