Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంటిజెంట్ వర్కర్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్

కాంటిజెంట్ వర్కర్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్

- Advertisement -

కాంటిజెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అక్కి అశోక్ గౌడ్..
నవతెలంగాణ – వంగూరు
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 24X7 కాంటిజెంట్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని కాంటిజెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అక్కి అశోక్ గౌడు డిమాండ్ చేశారు. 66/2011 రిజిస్ట్రేషన్ గల 360 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇద్దరి చొప్పున 720 మంది 25 ఏళ్ల నుంచి అతి తక్కువ చాలీచాలని జీతాలతో సతమతమవుతూ కుటుంబాలను నెట్టుకు రావడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. రాష్ట్రంలోని ఎన్ హెచ్ ఎం ఉద్యోగులుగా ఉన్న మాకు సరిగా జీతాలు రావడం లేదని వారు ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం రావడం లేదని, ఇంతకముందు కాంటిజెంట్ వర్కర్ల సమస్యలపై ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశామని అన్నారు. ఇప్పటికే 2018లో 510 జీవో ప్రకారం ఒకరికి జీతం పెరగానందున 6 లక్షల రూపాయలు చొప్పున నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ప్రతినెల 1వ తారీకు జీతాలు వేసి ఆదుకోవాలని కోరారు. ఎన్నో ఏండ్ల నుండి వ్యటిచాకిరి చేయించుకున్న కాంటిజెంట్ వర్కర్లకు న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -