నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని లింగాల రోడ్డులో స్తూపం నుండి పూనుగండ్ల కామారం క్రాస్ రోడ్ మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని లింగాల నూతన కాలనీ వాసులు కోరారు. గుండాల, మహబూబాబాద్, భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం పట్టణాల ద్వారా పస్రా, మేడారం వెళ్లే వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయని ఆవేదన చెందారు. రోడ్డుపై ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయని భద్రత కోసం, వేగాన్ని తగ్గించడం కోసం రవాణా సక్రమంగా సాగేందుకు స్పీడ్ బ్రేకర్స్ నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదివాసీలు కోరారు. సంబంధిత అధికారులు స్పందించి ఇప్పుడు కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడ ఈ పరిస్థితులను పరిశీలించి, నూతనంగా వేసే లింగాల స్తూపం నుండి వేసే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయం నర్సింహారావు, ఊకే రవి, పెండకట్ల క్రిష్ణ, లింగాల యూత్ నాయకులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చెయ్యాలి ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES