Friday, April 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో మార్చి – 2026 ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయనీ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేసి పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,154 మంది విద్యార్థులకు పరీక్షలు కేటాయించగా, 13,117 మంది హాజరయ్యారు. కాగా 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారీ రాజు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -