Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంముథోల్‌లో బుద్ధుడి విగ్రహ కూల్చివేత దుర్మార్గం

ముథోల్‌లో బుద్ధుడి విగ్రహ కూల్చివేత దుర్మార్గం

- Advertisement -

– కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ముథోల్‌లో బుద్ధుని విగ్రహాన్ని తొలిగించి, దళితులపై దౌర్జన్యం చేసిన మతోన్మాదులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మతోన్మాదంతో స్థానిక బీజేపీి ఎమ్మెల్యే అండదండలతో దళిత మహిళలపై కొందరు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. రాళ్లు రువ్వి, కర్రలతో కొట్టటం వల్ల ఆ మహిళల తలలకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయాలపాలైన వారిపైనే అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌ చేయటమేంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ ఘటనపై తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -