Wednesday, October 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవైట్‌ హౌస్‌ ఈస్ట్‌వింగ్‌ కూల్చివేత

వైట్‌ హౌస్‌ ఈస్ట్‌వింగ్‌ కూల్చివేత

- Advertisement -

ట్రంప్‌ కలల ప్రాజెక్టు కోసం ఆరాటం
వాషింగ్టన్‌ :
నో కింగ్స్‌ అంటూ ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేక నిరసనలు ఉధృతమవుతున్నా..ట్రంప్‌ తీరు అస్సలు మారటం లేదు. తన కలల ప్రాజెక్టు కోసం వైట్‌హౌస్‌లోని పురాతన కట్టడాన్ని కూల్చేశారు. ఇప్పుడు అక్కడ బాల్‌రూమ్‌ నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వైట్‌హౌస్‌లో ఈస్ట్‌వింగ్‌ విభాగంలో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. స్వయంగా ట్రంపే ఈ విషయాన్ని ట్రూత్‌ సోషల్‌ వేదికగా తెలిపారు. సోమవారం ఈ ఈస్ట్‌వింగ్‌ లోని ప్రవేశ ద్వారం, కిటికీలను సిబ్బంది కూల్చేశారు. శ్వేతసౌధంలో 25 కోట్ల అమెరికన్‌ డాలర్ల వ్యయంతో ట్రంప్‌ ఈ బాల్‌రూమ్‌ (నృత్యశాల) నిర్మిస్తున్నారు. ఇది వైట్‌హౌస్‌లో ట్రంప్‌ చేపట్టనున్న అతిపెద్ద నిర్మాణ కార్య క్రమం. దీన్ని ఈస్ట్‌వింగ్‌ ప్రాంతంలో నిర్మి స్తున్నారు. ఇక్కడ 999 మంది కూర్చొనేందుకు వీలుగా ప్లాన్‌ చేశారు. ఈ బాల్‌రూమ్‌ నిర్మాణం 150 ఏండ్లకు పైగా అమెరికా అధ్యక్షుల కల అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టినట్టు తెలిపారు. దీనికి సంబంధించి అమెరికన్‌ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఖర్చు ఉండదన్నారు. ఇక, ఈ నిర్మాణం కోసం అనేకమంది ఉదార దేశభక్తులు, గొప్ప అమెరికన్‌ కంపెనీలు స్వతహాగా నిధులు సమకూరుస్తున్నా యన్నారు. ఇది వైట్‌హౌస్‌ నిర్మాణానికి అను సంధానంగా ఉన్నప్పటికీ.. దీనికి శ్వేతసౌధంతో సంబంధం లేదని తెలిపారు. వైట్‌హౌస్‌ రెండు శతాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడి చారిత్రక నివాసంగా ఉంది. ఈస్ట్‌ వింగ్‌ను 1902లో నిర్మించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -