నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ ప్రధాన రహదారి విస్తరణ పనులు మళ్ళీ వేగవంతమయ్యాయి. రాజన్న ఆలయం ముందు నుంచి బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణలో భాగంగా కోర్టు స్టే ముగిసిన భవనాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 243 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. వీరిలో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందిన 88 మందిని గతంలో మినహాయించి, మిగతా భవనాల కూల్చివేతలను అధికారులు గత నెల 16న ప్రారంభించారు. ప్రస్తుతం, మరో ఆరుగురికి జూలై 23 వరకు కోర్టు స్టే ఉండటంతో వారిని మినహాయించి, మిగిలిన 82 భవనాలను శుక్రవారం నుంచి కూల్చివేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు రెండు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణ పనుల వద్ద భారీగా పోలీసులు, రెవెన్యూ అధికారులు మోహరించారు.
భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న కూల్చివేతలు..
- Advertisement -
- Advertisement -