వాడిదెంత చావు తెలివో చూశారా?
కిరాయిహంతకులకు ఆయుధాలిచ్చి
మతం పేరుతో మన ప్రాణాలనే తీసి
యావత్ దేశం మీదకు ఒక రాక్షసాస్త్రం
గురిచూసి వదిలాడు..
సరిగ్గా మనం దేనికి కూలిపోతామో అదే!
అణుబాంబుకంటే ప్రమాదకరమైంది
భీష్ముణ్ణి కూల్చిన శిఖండి లాంటిది
అదే, మతం బాంబు..!
ఎందరో మేధావులు, ఇన్ని సిద్ధాంతాలున్నా
అదుపు తప్పి ఆ అస్త్రానికి లొంగిపోయాం!
మతాల మంటలు అంటుకొంటుంటే
నిస్సహాయులమై చూస్తూండిపోయాం!
మతమౌఢ్యాన్ని పెంచిపోషిస్తున్న
మన నాయకగణం
ఉగ్ర హంతకులకైంది చాకచక్యం
వాళ్లు నాశనమయ్యారని వాళ్లకు తెలుసు
మనల్ని మతంలో మట్టుపెట్టడం వారి లక్ష్యం తెల్లచొక్కాలో ఉన్న మనల్ని కూడా రెచ్చగొట్టో
చిచ్చుపెట్టో బురదలోకి లాగి నాశనం
చెయ్యాలన్నదే వాళ్ల చిరకాల తాపత్రయం!
అవినీతి, తీవ్రవాదంతో అట్టడుగు స్థానంలో ఉన్నవారు
ఏదోలా కాలడ్డం పెట్టి యుద్ధంలోకి లాగి
పేకమేడలా కూల్చేందుకు పన్నిన మహాదుష్ట
రణతంత్ర వ్యూహమే ఈ ఉగ్రదాడి..!!
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253