Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండాలల్లో డెంగ్యూ కేసులు 

తండాలల్లో డెంగ్యూ కేసులు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని పలు తాండాలల్లో ఆరు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మండలంలోని రాజమ్మ తండా-1, రమణ తండా-3, గుడి తాండ-1, ఘన్పూర్ తాండ-1, కేసులు నమోదయ్యాయని గురువారం రామారెడ్డి, అన్నారం పిహెచ్సి వైద్యులు సురేష్, మానస తెలిపారు. రోగులు యాక్టివ్గా ఉన్నట్లు తెలిపారు. రాజమ్మ తండాలో గురువారం ఎంపీడీవో నాగేశ్వర్, వైద్యులు సురేష్, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ తోపాటు వైద్య బృందం ఇంటింటి సర్వే నిర్వహించి, వైద్య క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల్లో నీటిని నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలని, నీటిలో లార్వా ఏర్పడి, తోక పురుగులతో డెంగ్యూ దోమలు గా వృద్ధి చెందుతాయని, ప్రతి ఒకరు పరిశుభ్రతతో పాటు, నీరు నిలువ ఉన్నచోట ఆయిల్ బాల్స్ గాని, బ్లీచింగ్ పౌడర్ గాని వేయాలని సూచించారు. ఎవరికైనా జ్వరం వచ్చిన, ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇండ్లలో దోమతెరలను వాడాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -