Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు

తెలంగాణ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు

- Advertisement -

రాబోయే మూడ్రోజుల పాటే ఇదే తీరు
కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గిందన్న వాతావరణ కేంద్రం


హైదరాబాద్‌ : తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్టు తెలిపింది. తూర్పు, ఆగేయ దిశల నుంచి తేమ గాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్‌ రావు వెల్లడించారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. నాలుగో రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుదంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్‌ రావు తెలిపారు.

శీతాకాలంలో సాధారణంగా భూమి రిరేడియేటింగ్‌ క్రియేట్‌ చేస్తుంటుందని, అలాగే ఇటీవల మేఘాలు లేకుండా ఉండటం, గాలిలో తేమలేకపోవడం వల్ల చలి ఎక్కువగా ఉందని వాతావరణ అధికారి శ్రీనివాస్‌ రావు చెప్పారు. దీనికి తోడు ఉత్తర రాష్ట్రాల నుంచి చలి ఉండటం వల్ల డిసెంబరు నెల మొత్తం చాలా తక్కవ ఉష్ణోగతల్లో ఉండటం జరిగిందన్నారు. గత రెండు రోజుల నుంచి కూడా ఈ గాలుల ప్యాటెర్న్‌ మారిందన్న ఆయన ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కాకుండా ప్రస్తుతం తూర్పు, ఆగేయం నుంచి ఈ గాలులు ప్రవేశిస్తున్నాయని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు
తూర్పు, ఆగేయం గాలుల వల్ల తేమ ప్రవేశించడం జరుగుతుందని, తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తేమ ప్రవేశించడం వల్ల సాచురేషన్‌ అంటే వంద శాతానికి చేరుకోవడంతో ఉదయం పొగమంచు తీవ్ర స్థాయిలో ఉంటుందని వాతావరణ అధికారి తెలిపారు. ఇది భూమి నుంచి తక్కువ ఎత్తులో ఏర్పడుతుందని, తేమ వంద శాతం ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు పెరిగాయని అన్నారు. ఇదే సమయంలో తేమ కూడా చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు కూడా ఎక్కువగా వ్యాపించిందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -