నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో పలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు మార్గాలతో పాటు విమాన రాకపోకలకు అధిక ప్రభావం చూపుతోంది. మధ్యాహ్నం దగ్గర పడుతున్నా ఢిల్లీని దట్టమైన పొగమంచు వీడడంలేదు. వాతావరణం పరిస్థితి బాగోలేక పోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అప్రమత్తం అయింది. దాదాపు 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రగతి మైదాన్, భైరత్ మార్గ్, ఆనంద్ విహార్‌లో దృశ్యమానత తగ్గిపోయింది. మధ్యాహ్నం అవుతున్న కూడా వాహనదారులు హెడ్‌లైట్లు ఉపయోగించి డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక ఎయిర్‌పోర్టులకు వచ్చే ప్రయాణికులు వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. క్యాన్సిల్ అయిన విమాన ప్రయాణాలు మార్చుకోవచ్చని.. పూర్తి వాపసు కూడా ఇస్తామని చెప్పాయి.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు..100కు పైగా విమానాలు రద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



