నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సహాకారంతో రూ. రెండున్నర లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్లను మంగళవారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, డీసీఈబీ కార్యదర్శి సీతయ్యతో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ… విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలకు తనవంతు సహాయం చేయడం గోప్ప విషయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాన్రెడ్డి, మాజీ సర్పంచి సుదర్శన్, గంగాధర్, అమ ఆదర్శ పాఠశాల చైర్మన్ సావిత్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పరిశీలన….
డిచ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అకస్మీకంగా సందర్శించి పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి… విద్యార్థులతో మాట్లాడారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధ్యాపకులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.