Monday, July 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను తుంగలో తొక్కిన డిఈ ఓ.

ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను తుంగలో తొక్కిన డిఈ ఓ.

- Advertisement -

జిల్లా విద్యాశాఖ అధికారిపై శాఖమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
నవతెలంగాణ – జన్నారం

ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు పాలదర్శకంగా నిర్వహించాలని ఉద్దేశంతో జారీ చేసిన సర్దుబాటు ఉత్తర్వులను అతిక్రమించి తన ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేష్ నాయక్ అన్నారు. సోమవారం జన్నారం ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని సర్దుబాటును చేసినట్లు ఈ ఉపాధ్యాయ సర్దుబాట్లు ఉన్నాయన్నారు.. కొన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కూడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తుందన్నారు.

జన్నారం మండలంలోని అత్యధిక విద్యార్థులు ఉన్న ప్రాథమిక కొన్నత పాఠశాలలు రేండ్లగూడ, ఇంధన్ పెళ్లి ధర్మారం పాఠశాలలో స్కూల్ ఉపాధ్యాయులు ,భాష ఉపాధ్యాయులు పక్క మండలాల్లో మిగులు ఉపాధ్యాయులు ఉన్నా కూడా సర్దుబాటు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. సర్దుబాటు ఉత్తరువు   సంఖ్య 25 ప్రకారం మిగులు ఉపాధ్యాయులు పనిచేస్తున్న మండలాలలోనే ఖాళీ లేకుంటే పక్క మండలాలలో లేకుంటే జిల్లాలో ఎక్కడైనా సర్దుబాటు చేయాలనే ఉత్తర్వులున్నాయ      కానీ మంచిర్యాల జిల్లా విద్యాధికారి సర్దుబాటు ఉత్తర్వులను పక్కన పెట్టి మండలంలో మిగులు ఉపాధ్యాయులు ఉన్నా కూడా దూర ప్రాంతంలో నుండి ఉపాధ్యాయుల సర్దుబాటు చేయడం లో అనేక అక్రమాలు చేస్తున్నాడన్నారు.

లక్షట్ పేట్ మండల్ కి పక్క మండలమైన దండేపల్లి లో అదనపు ఉపాధ్యాయులు ఉన్నా కూడా కోటపల్లి నుండి స్కూల్ అసిస్టెంట్ ను నుండి కేటాయించారు. ఇదే మాదిరిగా చెన్నూరు నుండి మందమర్రి కి , మండలంలో మిగులు ఉపాధ్యాయులు ఉండగా పక్క మండలం  మండలం నుండి లక్షట్ పేట్ మండలం కి చెన్నూరు మండలం నుండి మందమర్రి మండలానికి తాండూర్ మండలం నుండి మంచిరాల మండలానికి రేచిని నుండి మంచిర్యాల మండలానికి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ, నిబంధనలు అతిక్రమించి ఉన్నతాధికారాలను తప్పుదోవ పట్టించి సర్దుబాటు ప్రక్రియను నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి పై శాఖ పరమ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు

పాఠశాల సందర్శన సమయంలో చిన్న చిన్న కారణాలకే ఉపాధ్యాయులకు షోకాజు నోటీలు జారీ చేస్తూ, తన ఆఫీసు చుట్టూ తెంపుకుంటూ కొంతమంది ఉపాధ్యాయులను ఏజెంట్లుగా పెట్టుకొని , ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -