నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సమయ పాలన పాటించకుండా విధులకు సకాలంలో హాజరుకాని ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి, భువనగిరి మండలం రాయగిరి, భూధాన్ పోచంపల్లి జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లపై శాఖా పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ్మ జిల్లా కలెక్టర్ హనుమంతరావును కోరారు. సోమవారం భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెటర్నరీ డాక్టర్లు సమయపాలన పాటించి గొర్లకాపరులకు అందుబాటులో ఉండాలని, మందల వద్దకు వెళ్లి గొర్రెలు, మేకలకు నట్టల మందులు, చిటుక రోగం, మూతివాపు, పారుడురోగం, దొబ్బరోగం, డెక్కవాపు, కీళ్ళవాతంతో పాటు సీజనల్ గా వచ్చే అన్ని రోగాలకు ఉచితంగా మందులు ఇచ్చి ఏలాంటి ఫీజులు తీసుకోకుండా ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా వృత్తిదారులు, గొల్ల కురుమలను సమీకరించి పెద్దయెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు, భువనగిరి మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవునూరి బాలయ్య, పాక జహాంగీర్, జిల్లా కమిటీ సభ్యులు రాయగిరి సొసైటీ అధ్యక్షులు మన్నెబోయిన రాజలింగం, ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి, మేకల శ్రీశైలం, స్వామి, నర్సింహ్మ, వెంకటేష్, పాల్గొన్నారు.
వెటర్నరీ డాక్టర్లపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES