- Advertisement -
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయిన 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెండు సంవత్సరాల పాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్‌పై నియామకానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం జీవో 190 జారీ చేసింది. ఆ నిర్ణయానికనుగుణంగా అంతర్ జిల్లా డిప్యూటేషన్ ప్రక్రియను ప్రభుత్వం అమలు చేసింది. సర్కార్ నిర్ణయం పట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క వారు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



