ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎమ్మెల్యే జారే
నవతెలంగాణ – అశ్వారావుపేట: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు శనివారం అశ్వారావుపేట రానున్నారు. ఇందుకోసం స్థానిక ఫాం ఆయిల్ పరిశ్రమ ప్రాంగణంలో సభావేదిక ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏర్పాట్లును శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్ ఆర్ధిక నిధులతో దమ్మపేట మండలం పార్కలగండి, అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట పట్టణంలో అచ్యుతాపురం, తిరుమలకుంట, కావడి గుండ్లలో నిర్మించే విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మాణానికి సభావేదిక వద్దనే పైలాన్ ఆవిష్కరిస్తారు అని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్ లోని బేగం పేట ఎయిర్ పోర్ట్ లో శనివారం ఉదయం 10 గంటలకు హెలీక్యాప్టర్ లో బయలు దేరి అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ 11పై ల్యాండ్ అవుతారని సమాచారం. ఇక్కడే అధికారులను కలుసుకుంటారు ఆని తెలిపారు. 11.10 నుండి 1 గంట వరకు సభావేదిక వద్ద రైతులతో సమావేశం అవుతారని తెలిపారు.1 గంట నుండి 1.45 వరకు భోజన విరామం అనంతరం 1.50 కి బయలు దేరి 3 గంటలకు హైద్రాబాద్ చేరుకుంటారని వివరించారు. ఆయన వెంట ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం, ఏఈఈ రవి కుమార్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రేపు అశ్వారావుపేటకు రానున్న డిప్యూటీ సీఎం భట్టి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES