Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబనకచర్లపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

బనకచర్లపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటాలు తేలిన తర్వాతే గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు నిర్మించినా అది చట్టబద్ధంగా, న్యాయంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నీటి వాటాలను నిర్ధారించాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.

‘ఓట్ల చోరీ’ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నంలో వచ్చిన భట్టి విక్రమార్క, మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. నదీ జలాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి, నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశంపై ఒక స్పష్టత వస్తుందని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -