- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులతో మాట్లాడి, ఫైరింగ్ విధానాలు, ఆయుధాల వినియోగం గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన వ్యక్తిగత గ్లాక్ 0.45 పిస్టల్‌తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను పవన్ కళ్యాణ్ స్వయంగా పంచుకున్నారు. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని గుర్తుచేసుకున్నారు. “ఏపీ పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించాను. అక్కడ కొంతసేపు ప్రశాంతంగా నా గ్లాక్ 0.45 పిస్టల్‌తో కొన్ని రౌండ్లు ప్రాక్టీస్ చేశాను. ఆయుధాన్ని శుభ్రం చేశాను” అని తెలిపారు.
- Advertisement -



