– అక్రమ అరెస్టులు నిర్బంధాల వలన పోరాటాలను ఆపలేరు
– డిప్యూటీ సీఎం, పోలీసుల నిరంకుశ పోకడలను ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఖండించాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
– నియోజకవర్గ వ్యాప్తంగా అడుగడుగునా సీపీఐ(ఎం) నాయకుల అక్రమ అరెస్టులు
నవతెలంగాణ – బోనకల్
తాము సీపీఐ(ఎం) నాయకుల, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోనే పోలీస్ అధికారులు పరోక్షంగా అంగీకరించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పోతినేని సుదర్శన్ రావు వీడియో రిలీజ్ చేశారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఐ(ఎం) నాయకుల, కార్యకర్తలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పోలీస్ శాఖను గుప్పెట్లో పెట్టుకొని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని నిరసిస్తూ సీపీఐ(ఎం) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మధిర నియోజకవర్గం కేంద్రంలో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దీంతో మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో శనివారం ఉదయం నుంచే మధిరకు బయలుదేరారు.
తనకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుందనే భయం పట్టుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని అర్థరాత్రి సీపీఐ(ఎం) నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి తాము తప్పు చేశామని పరోక్షంగా డిప్యూటీ సీఎం ఒప్పుకున్నారని పోతినేని సుదర్శన్ రావు వీడియో రిలీజ్ చేశారు. ఎన్ని అక్రమ అరెస్టులు జరిగిన, నిర్బంధాలు ప్రయోగించిన మధిర నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ప్రదర్శన కొనసాగుతుందని పోతినేని సుదర్శన్ రావు స్పష్టం చేశారు. మల్లు భట్టి విక్రమార్కు భయం పట్టుకుందని దీంతో స్పష్టమైందని ఆయన తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ నిర్బంధాలను అక్రమ కేసులను బనాయించాలని చూస్తే సీపీఐ(ఎం) పోరాటాలతో అడ్డుకుంటుందని పోతినేని సుదర్శన్ రావు స్పష్టం చేశారు.

సీపీఐ(ఎం) నాయకుల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి సంతోషపడుతున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆయన సతీమణి మల్లు నందిని సీపీఐ(ఎం) నిరసన ప్రదర్శనను పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్టు చేయించడంతోటే వాళ్ళ తప్పును వారే పరోక్షంగా అంగీకరించినట్లు అయిందని తెలిపారు. మధిర నియోజకవర్గ ప్రజలు డిప్యూటీ సీఎం ఆయన సతీమణి మల్లు నందిని పోలీస్ శాఖ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ప్రజాతంత్ర వాదులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని పోతినేని సుదర్శన్ రావు, సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు కోరారు. మధిర నియోజకవర్గంలో పోరాటాల కాలం ప్రారంభమైందన్నారు.
ఈ పోరాటాలను ఎంత గట్టిగా అడ్డుకుంటే అంత రెట్టింపుతో పోరాటాలు ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మల్లు భట్టి విక్రమార్క, పోలీస్ శాఖ నియంతృత్వానికి జరుగుతున్న పోరాటముగా పోతినేని సుదర్శన్ రావు అభివర్ణించారు.ఇది ఇలా ఉండగా మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ముదిగొండ, చింతకాని, బోనకల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే సీపీఐ(ఎం) నాయకుల ఇళ్లకు వెళ్లి అరెస్టు చేశారు. ముదిగొండ చింతకాని బోనకల్ మండలాల నుంచి మధిర వెళ్లకుండా పోలీసులు కలకోట బస్టాండ్ వద్ద బారికేళ్ళు పెట్టి అడ్డుకుంటున్నారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కిలారు సురేష్ అక్రమ అరెస్టుకు నిరసనగా చొప్పకట్లపాలెంలో సీతం నాయకుల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముదిగొండ నుంచి వచ్చే వాళ్ళని చింతకాని మండలం నాగులవంచ వద్ద బారికేళ్ళు పెట్టి అడ్డుకుంటున్నారు. బోనకల్ నుంచి వెళ్లే వారిని కలకోట బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. అయినా చింతకాని ముదిగొండ బోనకల్ మండలాల నుంచి అనేకమంది సిపిఎం కార్యకర్తలు వివిధ రూపాలలో మధిర చేరుకున్నారు. అక్రమ నిర్బంధాలతో శనివారం జరిగే నిరసన ప్రదర్శన అడ్డుకున్న భవిష్యత్తులో మరిన్ని పోరాటాలను పోలీసులు బట్టి విక్రమార్క చవిచూడాల్సి వస్తుందని వారి హెచ్చరించారు.




