నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు స్వాత్విక్, కృత్తిక లు శనివారం భువనగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించినట్లు భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఆదేశాల మేరకు శిక్షణా డిప్యూటీ కలెక్టర్లు సాత్విక్,కృతిక భువనగిరి మండల పరిషత్ కార్యాలయం సందర్శించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రభుత్వ విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలు తీరు అంశాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో యంపిడిఓ శ్రీనివాస్ ద్వారా తెలుసుకోవడం జరిగిందనారు. అనంతరం మండలంలోని పైలెట్ గ్రామపంచాయతీ బండ సోమవారం సందర్శించి, గ్రామంలోని పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను, నిర్మాణము వివిధ దశల్లో ఉన్న ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులతో ఇంటి నిర్మాణంనకు సంబంధించిన అంశాలను ,బిల్లుల చెల్లింపులు, సామాగ్రి లభ్యత విషయాల గురించి తెలుసుకొని, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై హర్షం వ్యక్తం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
మండల పరిషత్ కార్యాలయాన్ని శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



