Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనని వెంటనే సస్పెండ్ చేయాలి 

డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనని వెంటనే సస్పెండ్ చేయాలి 

- Advertisement -

సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనాని వెంటనే సస్పెండ్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డివైడ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద చంద్రశేఖర్ కాలోని పీహెచ్సీ ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. సమస్యలు ఉన్నాయని చెప్పడానికి డిఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్తే ఈ టైంలో మీరు రావద్దు సాయంత్రం నాలుగు గంటల తర్వాత రావాలి ఆశా వర్కర్లు డ్యూటీలో ఉండాలి అనేది చెప్పారు. బాధలు ఉన్న ఇబ్బందులు ఉన్న అధికారుల వేధింపులు ఉన్న చెప్పుకోవద్ద అనేది చర్చ జరిగింది ఒక ఆశా వర్కర ( శోభ) పట్ల డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజన వైఖరి మార్చుకోవాలని అన్నం కానీ డిఎంహెచ్ఓ  ఆశాలు గాజులు పెట్టుకోవద్దు ,లిఫ్టిక్ గూడ పెట్టుకోవద్దు ,మీకు రూల్స్ తెల్వయా అని బెదిరించారు.

అనంతరం అదనపు కలెక్టర్ కి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదనపు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. చర్చలు జరిపే వరకు విధులను చేయలేము అని అదనపు కలెక్టర్ కి విన్నవించారు. చంద్రశేఖర్ కాలనీ ఏరియాలో 13- 8- 2025 నాడు డెంగ్యూ కేసు వచ్చింది శోభ సర్వే చేయడం జరిగింది. 13/8/25/ నాడు సబ్ సెంటర్లో ఇమినేషన్ మరియు హెల్త్ క్యాంపు జరిగింది.సర్వేలో ఉన్నప్పుడు ఏరియాకి డాక్టర్ అంజన మేడం గారు రావడం జరిగింది. డెంగ్యూ కేసు ఇంటి వద్దకు తీసుకొని ఆశ వర్కర్ శోభ తీసుకెళ్లింది. అప్పుడు జనం ముందు లిఫ్టిక్ ఎందుకు పెట్టుకున్నావు అని , శోభ కు తిట్టడం జరిగింది మరియు సరళ మేడం కి మీ అంగన్వాడి కేంద్రం వద్ద హెల్త్ క్యాంపు వద్ద ఇమినేషన్ లో సరళ కి మీ ఆశ పబ్లిక్ ముందు మీ ఆశ లిప్టిక్ ఎందుకు పెట్టుకుంది. చాలా ఇన్సల్ట్ గా మాట్లాడడం జరిగింది.

ఇది తన పర్సనల్ విషయం అడగడం సరైనది కాదని ఆశా వర్కర్ ఇంటికెళ్లి చాలా విడిచింది. చావాలనిపించింది. ఏడ్చింది అధికారులు తోటి మహిళా అని కూడా ఆలోచించకుండా ఆమె పట్ల జనంలో అనడం ఇబ్బంది అనిపిస్తుంది. పర్సనల్ విషయాలలో కూడా జోక్యం చేసుకోవడం సరైనది కాదని ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని ఆమెపై చర్య తీసుకోవాలని కోరుతున్నాము. లేనియెడల ఆమెపై చర్య తీసుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో శోభ, సిహెచ్ నర్స,, స్వప్న మా దేవి కవిత పద్మ లలిత సుమలత అనిషా బేగంహనీఫా లావణ్య సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad