నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎండాకాలంలో అవసరమైన మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. వార్డు, పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట ఆవరణను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 31వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించనున్న స్పెషలిస్ట్ క్యాంప్‌కు సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ దివ్య, హెచ్ ఈ ఒ వెంకటరమణ, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



