Sunday, September 21, 2025
E-PAPER
Homeజిల్లాలుఆరోగ్య శిబిరాలను పరిశీలించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

ఆరోగ్య శిబిరాలను పరిశీలించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలను డిప్యూటీ డిఎంహెచ్వో ప్రభు కిరణ్ శనివారం పరిశీలించారు. ప్రతి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని, అనారోగ్యానికి గురికాకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ప్రజలకు వివరించాలన్నారు. పట్టణ కేంద్రంలోని బీసీ హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య వివరాలు హాస్టల్ వెల్ఫేర్ అధికారి సునీతతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో పకడ్బందీగా వైద్య పరీక్షలు నిర్వహించాలని మెడికల్ అధికారి యేమిమాకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ వో వెంకటరమణ, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -