- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: విజయనగరం రైల్వే స్టేషన్‌లో దాదాపు 5 గంటల వరకు అన్ని రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. శుక్రవారం విజయనగరంలో ఎత్తి బ్రిడ్జి కింద ఒక గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఒక ఎలక్ట్రికల్ పోల్ తిరగబడిపోయి ఎలక్ట్రికల్ సప్లయి ఆగిపోయింది. ఆ సమస్యను క్లియర్ చేయడానికి మినిమం 5 గంటలు పడుతుంది అని అధికారులు అంటున్నారు. అందుచేత ప్రయాణికులు విషయాన్ని క్లారిటీగా తెలుసుకొని వేరే మార్గం చూసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో విజయనగరం స్టేషన్లో మినిమం 5 గంటల వరకు అన్ని రైలు రాకపోకలు ఆగిపోయే అవకాశముంది.
- Advertisement -