Sunday, October 19, 2025
E-PAPER
Homeకవితకోరిక

కోరిక

- Advertisement -

అలసిసొలసిన వేళ
ఒక్కోసారి అనిపిస్తుంది….
కాలం వెనక్కొస్తే బాగుండునని,
గడచిన అనుభూతులను
తిరిగి పొందడానికి.
శిశువునైతే బాగుండుననుకుంటుంటా
అమ్మ ఒడిలో మళ్లీ ఆడుకోడానికి.
బాలుడనై స్కూలుకెళ్లాలనుకుంటున్నా,
చిన్ననాటి స్నేహితులతో
సంతోషంగా గడపడానికి.
కాలేజీకి వెళ్లే
విద్యార్దినైతే ఎంతబావుంటుందో!
నా స్థాయి తెలుసుకోడానికి.
అనుకుంటున్నాను నాటి
నూతనోద్యోగిగా మారాలని,
తొలి జీతం తీసుకున్న ఆనందక్షణాలు
తిరిగి పొందడానికి.
నాటి…వరుడ్నైతే బాగుంటుంది
యవ్వనానుభూతులను తిరిగి
ఆస్వాదించడానికి.
నా బిడ్డ ఇంకా చిన్నవాడిగా ఉంటే
ఎంత బాగుండునో!
ఇంకా ఎక్కువ కాలం వాడితో గడపొచ్చుగా!
మరణానికి నే భయపడను,
కవిగా నే చిరకాలం బతికేవుంటానుగా!
కానీ…
మరింతకాలం బతకాలనిపిస్తోంది,
సమాజానికి ఇంకా ఏమివ్వగలనో
తెలుసుకోడానికి.
మిత్రులారా!
ప్రవహించే నదిలో నీళ్లు వెనక్కిరానట్లే
గడచిన కాలమూ తిరిగిరాదని గుర్తెరిగి,
ప్రతి క్షణాన్నీ మధురానుభూతులను
మిగిల్చేదిగా మలచుకుందామా మరి!

  • వేమూరి శ్రీనివాస్‌, 9912128967
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -