నవతెలంగాణ – తిమ్మాజిపేట
కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ లోని 02, 13, 12 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం చేశారు. సందర్భంగా ఆయా వార్డులలోని కాలనీలలో పర్యటిస్తూ కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటి అని ఆలోచించి ఓటు వేయాలి అని కోరారు. గత ప్రభుత్వంలో నాగర్ కర్నూల్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వాటిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తున్న మోసాలను బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల పార్టీ అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిపాలనను గాలికొదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



