Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూడైస్ లో వివరాలను పక్కాగా నమోదు చేయాలి 

యూడైస్ లో వివరాలను పక్కాగా నమోదు చేయాలి 

- Advertisement -

మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ 
నవతెలంగాణ -పెద్దవంగర: యూడైస్ పోర్టల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలల పూర్తి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులు తో కలిసి శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాల వివరాలను ఆన్ లైన్ యూడైస్ లో నమోదు చేసే ప్రక్రియ, తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్స్ సత్యనారాయణ, సంతోష్ ఆధ్వర్యంలో హెచ్ఎం లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. పాఠశాలలకు సంబంధించిన అన్ని వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. తాగునీరు, టాయిలెట్స్, తరగతి గదులు, ప్లే గ్రౌండ్, ప్రహారీ, నిధుల వివరాలు పక్కాగా ఉండాలని సూచించారు. యూడైస్ వివరాల ఆధారంగానే పాఠశాలలకు అందించే సౌకర్యాలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, నిధులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. యూడైస్ వివరాలను అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కళాధర్, శేషవల్లి, ఐలయ్య, సతీష్, బీమా నాయక్, యాకయ్య, లక్ష్మయ్య, రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బాలరాజు, వాణి, మహబుబి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -