Sunday, January 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిజ జీవిత ఘటనలతో 'దేవగుడి'

నిజ జీవిత ఘటనలతో ‘దేవగుడి’

- Advertisement -

పుష్యమి ఫిలిం మేకర్స్‌ బ్యానర్‌ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచన, స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ,’టీజర్‌ను హీరో శ్రీకాంత్‌ రిలీజ్‌ చేసి సపోర్ట్‌ అందించారు. ఈ చిత్రంలో స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ వంటి అన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. స్క్రీన్‌ ప్లే చాలా షార్ప్‌గా ఉంటుంది.

ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఈ నెల 30న ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి సెంటర్స్‌లో మా మూవీని రిలీజ్‌ చేయబోతున్నాం. సాధారణ టికెట్‌ రేట్స్‌తో మా మూవీ మీకు అందుబాటులో ఉంటుంది’ అని తెలిపారు. ‘హీరో కావాలనేది నా కల. ఈ రోజు ఈ వేదిక మీద నిలబడటం సంతోషంగా ఉంది. మాకు ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేదు. కేవలం మా టాలెంట్‌ చూసి బెల్లం రామకృష్ణారెడ్డి అవకాశం ఇచ్చారు’ అని హీరో అభినవ్‌ శౌర్య చెప్పారు. హీరోయిన్‌ అనుశ్రీ మాట్లాడుతూ,’తెలుగులో హీరోయిన్‌గా మీ ముందుకు ఈ చిత్రంతో వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ మీరంతా ఇష్టపడేలా ఉంటుంది. కొన్ని పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ కూడా నాతో డైరెక్టర్‌ చెప్పించారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -