పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం రామకృష్ణా రెడ్డి రచన, దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రమిది. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్‌మీట్‌ను మేకర్స్ నిర్వహించారు. దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ,’మా సినిమాకి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందనే ప్రశంసలు వస్తున్నాయి.
సినిమాలోని రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. యాక్షన్ సీక్వెన్సులు, పాటల చిత్రీకరణ బాగుందనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్‌గా వచ్చాయి. మంచి రేటింగ్స్ ఇచ్చారు. మా చిత్రంలో రఘు కుంచె చేసిన వీరారెడ్డి పాత్ర హైలైట్ అయ్యింది. ఆయన పర్‌పార్మెన్స్ చాలా బాగుందని అంటున్నారు. అలాగే కీ రోల్స్ చేసిన అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ నటనను కూడా అందరినీ అలరిస్తోంది. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సక్సెస్‌తో మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నారు’ అని అన్నారు. ‘మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా చిన్న సినిమాను కూడా ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ ఈ చిత్ర విజయంతో మరోసారి ప్రూవ్ చేశారు. ఈ క్రెడిట్ బెల్లం రామకృష్ణా రెడ్డికే ఇవ్వాలి’ అని రఘుకుంచె చెప్పారు.
‘దేవగుడి’కి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



