నవతెలంగాణ – పెద్దవూర
అనాధలకు, అభాగ్యులకు ఆపన్నహస్తం అయిన సాధన యువసంఘం మండలం లోని పులిచెర్ల గ్రామంలో కామిశెట్టి సాలమ్మ అనే మహిళా వృద్ధురాలు వెన్నుపూస సమస్యతో నడుము పూర్తిగా వంకరతో మంచానికే పరిమితమైంది. తినడానికి తిండికూడా లేని పరిస్థితి లో ఉంది.కూలీకి పోదామంటే పని చేయలేదు. అందుకే గ్రామం లో ఇంటింటికి పోయి అడుక్కొని తింటూ కొంతకాలంగా జీవనం సాగిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సాధన యువజన సంఘం సభ్యులు పులిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దేవసాని శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య చిన్న కుమారుడైన దేవ సాని సూరజ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి ఆ మహిళ వృద్ధురాలకు రెండు నెలలకు సరిపడు బియ్యం, పప్పు, చింతపండు, మంచి నూనె, అన్ని రకాల కూరగాయలు, ఇతర సరుకులు మంగళవారం వితరణ చేశారు.చిన్న వయసులోనే మానవత్వం చాటుకున్న దేవసాని సూరజ్ రెడ్డి సాధన యువజన సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాధన యోజన సభ్యులు బుడిగపాక సత్యనారాయణ, బొడ్డుపల్లి చిరంజీవి, దేవన బోయిన కొండలు, ఖమ్మంపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న దేవసాని ధీరజ్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES