Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుభవంతో అభివృద్ధి సాధిస్తా 

అనుభవంతో అభివృద్ధి సాధిస్తా 

- Advertisement -

లక్నవరం సర్పంచ్ అభ్యర్థి భూక్యవాణి రాజు నాయక్ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

గత రెండుసార్లు సర్పంచ్ పనిచేసిన అనుభవంతో అభివృద్ధిని సాధిస్తానని లక్నవరం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భూక్యవాణి రాజు నాయక్ అన్నారు. సోమవారం లక్నవరం పంచాయతీ దుంపలగూడెం గ్రామంలో జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లతో వాణి రాజు నాయక్ మాట్లాడుతూ.. గత రెండు పర్యాయములు సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ముందు ముందు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కొత్తవారికి అవకాశం ఇస్తే అనుభవ రాహిత్యంతో అభివృద్ధి కుటుపడుతుందని అన్నారు. గతంలో చేసిన అభివృద్ధికి అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చి బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -