– ఏఎంసి వైస్ చైర్మన్ నేరేళ్ళ నర్సింగం గౌడ్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని సిరిసిల్ల ఏఎంసి వైస్ చైర్మన్ నేరేళ్ళ నర్సింగం గౌడ్ అన్నారు. మండలంలోని సారంపల్లి గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుక్రవారం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగెల రాజుతో కలిసి రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగ్గిళ్ళ రాములు, మాజీ ఉప సర్పంచ్ గుండి పర్శరాములు, మండల మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఎండి.హనీఫ్, గడ్డమిది శ్రీనివాస్, ఆనందం, దేవదాస్, కిషన్, అభిషేక్, సంజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES