– మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్..
నవతెలంగాణ – తొగుట
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఆదివారం దసరా పండుగ సందర్భంగా మండలంలోని వెంకట్రావు పేటలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డితో కలిసి నిరుపేదలకు దోతీ, ఆంగీలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కరువు, కాటకాలతో ఈప్రాంతం అల్లాడిపోయిందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాగునీరు, కరెంటు, అభివృద్ధి, సంక్షేమంలో చేశారని కొనియాడారు.
మాయ మాటలతో అధికారం లోకి వొచ్చిన రేవంత్ రెడ్డి మోసం ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దసరా పండుగ సందర్భంగా పేద వారికి దోతి, అంగీలను దుస్తులు పంపిణి చేశామ న్నారు. తనకు పదవులపై ఆశ లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డబ్బికారి పెంటోజీ, బండారు స్వామిగౌడ్, పిట్ల వెంకటయ్య, గంగొళ్ల రాజు, ఈదుగల్ల పర్శరాములు, కంకణాల స్వామి, పులిగారి లక్ష్మణ్, తర్గం నర్సింహ్మారెడ్డి, జహంగీర్, రాంబాబు, నవీన్ తదితరులు ఉన్నారు.
కేసీఆర్ హాయాంలోనే అభివృద్ధి సంక్షేమం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES