Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం..

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గురువారం బిఆర్ఎస్ నాయకులు అడ్డుఅదుపు లేకుండా కుచిన పిచ్చి కుతలను శుక్రవారం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దతూండ్ల గ్రామశాఖ అధ్యక్షుడు జక్కుల వెంకటస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని, చక్క దిద్దడానికి మంత్రి శ్రీధర్ బాబు అహర్నిశలు కృషి చేస్తూ.. ఇటు మంథని నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నట్లుగా తెలిపారు. కిషన్ రావుపల్లి నుంచి భూపాలపల్లి వరకు రోడ్డుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసి త్వరలో ప్రారంభం చేస్తున్న నేపథ్యంలో తమకు సహకరించకుండా విచిన్నం చేసే ఆలోచనలో బిఆర్ఎస్ నాయకులు ఉండడం దిక్కుమాలిన చర్యని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ యూత్ నాయకుడు మండల రాహుల్, ఎస్సిసెల్ మండల అధ్యక్షుడు మంత్రి రాజా సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు సబ్బిడి రమణ రెడ్డి, సారయ్య,పొలం రవి, బోయిని రాజయ్య, జోడు రవి, రాజశేఖర్, దండిగ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -