Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేసీఆర్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు 

కేసీఆర్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు 

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు టౌను 
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే, ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సజావుగా అందాయని, మాజీ ప్రభుత్వ విప్, మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా, బిఆర్ఎస్ 12 వార్డులకు చెందిన శ్రేణులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వంలో ఆలేరుకు ఎన్నో అభివృద్ధి పనులను చేశామని, వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు.

 ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డుల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి, గెలిపిస్తామని, మున్సిపాలిటీ వార్డులలో పోటీ చేసే  అభ్యర్థుల పేర్లను తీసుకుని పరిశీలిస్తామని, త్వరలోనే పేర్లను  ప్రకటిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో  వస్పరి శంకరయ్య, బొట్ల పరమేష్, పుట్ట మల్లేష్, సీస మహేశ్వరి,పోరెడ్డి శ్రీను, రామ్ గోపాల్ రెడ్డి, మోరిగాడి ఇందిర, మొర్తాల రమణారెడ్డి, జంపాల దశరథ, అంజన్ కుమార్, ఎస్ సంతోష్  కర్రె అశోక్, పంతం కృష్ణ, జె సిద్దులు, గంధమల్ల యాదగిరి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -