Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి మాటల్లోనే… కార్యాలయం దారి దుర్గతి

అభివృద్ధి మాటల్లోనే… కార్యాలయం దారి దుర్గతి

- Advertisement -

మండల అభివృద్ధి అధికారి కార్యాలయం రోడ్డు దుస్థితి…
ప్రజలకు ఇబ్బందులు
నవతెలంగాణ కాటారం
కాటారం మండల కేంద్రంలో ఉన్న అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయానికి వెళ్లే రోడ్డు దుస్థితి రోజురోజుకీ మరింత అధ్వాన్నంగా మారుతోంది. గుంతలతో నిండిపోయిన ఈ రోడ్డు ప్రజలకు నిత్యం ఇబ్బందులు కలిగిస్తోంది. వర్షాకాలంలో అయితే ఈ గుంతలు నీటితో నిండిపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ప్రతి రోజు పలు గ్రామాల నుంచి వచ్చే ప్రజలు, ఉద్యోగులు, వృద్ధులు ఈ రహదారిపై ప్రయాణించాల్సి వస్తోంది. కానీ రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు బైక్‌పై వెళ్లే వారు పడిపోవడం కూడా జరుగుతోంది. అత్యవసర సేవల వాహనాలు సైతం ఈ రోడ్డు కారణంగా ఆలస్యంగా చేరుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇది ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి అయినప్పటికీ, ఇంతకాలంగా మరమ్మతులు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -