Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి కుంటుపడింది..

అభివృద్ధి కుంటుపడింది..

- Advertisement -

-రోడ్ల అసంపూర్తి పనులపై బీఆర్ఎస్ నిరసన
-పోలీసులకు..శ్రేణులకు మధ్య తోపులాట 
-బీఆర్ఎస్ శ్రేణుల అరెస్ట్..అయా ఠాణాలకు తరలింపు
నవతెలంగాణ-బెజ్జంకి

మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికైన నుంచి మండలంలో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్  శ్రేణులు ఆరోపించారు. మండలంలో అసంపూర్తిగా మిగిలిన రోడ్ల పనులపై ఎమ్మెల్యే కవ్వంపల్లి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గురువారం మండల పరిధిలోని బేగంపేట నుండి మండల కేంద్ర వరకు బీఆర్ఎస్ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రోడ్లపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు.. శ్రేణులకు మద్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి అయా ఠాణాలకు తరలించారు. అసంపూర్తిగా నిలిచిన రోడ్ల పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేను బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -