నవతెలంగాణ -తాడ్వాయి
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, మారుమూల ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి అన్నారు. ఆదివారం మండలంలోని కాటాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. మార్కండేయ పద్మశాలి సంఘం భవణానికి 10 లక్షలతో కాంపౌండ్ వాల్, గీత కార్మికుల ఆరాధ్య దైవం కంఠమహేశ్వర స్వామి, ఎల్లమ్మ ఆలయానికి 10 లక్షల కాంపౌండ్ వాల్, కాటాపూర్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో సిసి రోడ్డు పనులు పది లక్షలనిధులతో మొదలగు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణికి, మండలాధ్యక్షుడు బొలు దేవేందర్ కు మార్కండేయ పద్మశాలి సంఘం నాయకులు, కలుగీత కార్మిక సంఘం నాయకులు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తు చేశారు.
ఇప్పుడు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కాంపౌండ్ వాళ్ళు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో ములుగు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. గౌడుల దేవాలయ భవనానికి, మార్కండేయ పద్మశాలి సంఘం భవనానికి కాంపౌండ్ వాల్ మంజూరు చేసిన మంత్రి సీతక్కకు ఆ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, మల్లూరు హేమచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం డైరెక్టర్ పల్నాటి సత్యం, మాజీ సర్పంచులు బెజ్జూరి శ్రీనివాస్, మంకిడి నరసింహస్వామి, ముజఫర్ హుస్సేన్, పులి నరసయ్య గౌడ్, పులి రవి గౌడ్, మద్దూరి రాములు, యూత్ నాయకులు కోడి సతీష్, మర్రి నరేష్, మద్దూరి రాజు, పాలకుర్తి మధు, బెల్లంకొండ రోశయ్య, నరేష్, గడ్డం శ్రీధర్, ముత్తినేని లక్ష్మయ్య, ముక్తి రామస్వామి, కుసుమ వెంకటేశ్వర్లు, వంగరి సదానందం, సజ్జు, కందకట్ల సాంబయ్య, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, మార్కండేయ పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.