Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి చేస్తే ఆదరణ కరువైంది.!

అభివృద్ధి చేస్తే ఆదరణ కరువైంది.!

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల్లో కంచుకోటలు మాయం
బిఆర్ఎస్ నాయకులపై మాజీ ఎమ్మెల్యే పుట్ట గుర్రు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఏనాడు జరగని అభివృద్ధిని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తే ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని, ఓటర్లు సైతం అభివృద్ధిని ఆదరించలేదని బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని మల్లారం గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల,కార్యకర్తల మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మాట్లాడారు మండలంలో ఏళ్లుగా జరగని శాత్రజ్పల్లి,పెద్దతూoడ్ల వాగులపై బ్రిడ్జిలు,తాడిచెర్ల ఖమ్మంపల్లి మానేరుపై బ్రిడ్జి,కిషన్ రావుపల్లి పారెస్ట్ వరకు రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేశాని తెలిపారు.

మంథని నుంచి తాడిచెర్లకు మండల కార్యాలయాల తరలింపు,అంతర్గత రోడ్ల నిర్మాణం,పేదలకు వైద్య సేవలందించడానికి తన తల్లి పుట్ట లింగమ్మ పేరుమీద తాడిచెర్ల అంబులెన్స్,కొయ్యుర్ పశువుల వైద్యం కోసం ఉచిత మందుల పంపిణీ చేసినట్లుగా తెలిపారు.తాడిచెర్ల నుంచి అందుగుతండా,శాత్రజ్ పెళ్లికి రోడ్ల ప్రపోజల్ పెట్టామని గుర్తు చేశారు. బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పరివర్తనలో మార్పులు రాకపోతే రాబోయే రోజుల్లో కష్టతరమైన పరిస్థితులు ఉంటాయన్నారు.

మండలంలో బిఆర్ఎస్ కు కంచుకోటలుగా ఉన్న తాడిచెర్ల, మల్లారం,వళ్లెంకుంట తదితర గ్రామాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో బిఆర్ఎస్ నాయకుల ఐక్యత లోపమేని చెప్పారు.కాటారం మండలంలో బిఆర్ఎస్ నాయకుల్లో మార్పుఉంది కానీ మల్హర్ మండల నాయకుల్లో మారు కాదు కదా బిఆర్ఎస్ గుండు సున్నగా మారిందని మండిపడ్డారు.ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు సంయుక్తంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -