Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంవికేంద్రీకరణతోనే అభివృద్ధి

వికేంద్రీకరణతోనే అభివృద్ధి

- Advertisement -

అందుకే అన్ని ప్రారతాలపై దృష్టి
కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం

అమరావతి : రాష్ట్రంలో జిఎస్‌డిపి వృద్ధి పెరగాలంటే అన్ని ప్రారతాల్లో సమాన దృష్టి అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే వికేంద్రీకరణ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా జిఎస్‌డిపి, శాఖల వారీగా కీ పర్‌ఫార్మెన్స్‌ ఇరడికేటర్లపై బుధవారం కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాల్లోనే కాకుండా శాఖల్లో కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ ఏడాది వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతంగా నిర్దేశిరచుకున్నట్లు చెప్పారు. ఈ లక్ష్యం సాధిరచాలంటే 17 అరశాల్లో ఫలితాలు సాధిరచాల్సి ఉరటురదన్నారు. లైవ్‌ స్టాక్‌, ఉత్పాదక రంగం, ఫిషిరగ్‌ వంటి రంగాలతో సహా ఇతర రంగాలపైనా కలెక్టర్లు దృష్టి సారిరచాలన్నారు.

వ్యవసాయ రంగం మరిరతగా వృద్ధి చెందాలన్నారు. వీటన్నిరటికీ జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొరదిరచుకోవాలన్నారు. వచ్చే సదస్సు నాటికి జిల్లాల్లో ప్రగతి కనిపిరచాలని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణతో పోటీగా ఉన్న రాష్ట్రం గత పాలకుల తప్పుడు విధానాలతో దక్షిణ భారతదేశంలోనే చివరి స్థానానికి చేరుకురదని చెప్పారు. తిరిగి అగ్రస్థానానికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశలో కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు. అంతకు ముందు ప్రణాళిక శాఖ అధికారులు రాష్ట్రంలో జిఎస్‌డిపి, ఇతర వృద్ధి అరశాలపై పవర్‌ పాయిరట్‌ ప్రజెరటేషన్‌ సమర్పిరచారు. శాఖల వారీగా, జిల్లాల వారీగా ఉన్న జిఎస్‌డిపి, కెపిఐ, ర్యారకులను వివరిరచి చెప్పారు.

వ్యవసాయ రంగంపైనే
జిbస్‌డిపిలో వ్యవసాయ రంగం కీలకమని చంద్రబాబు వ్యాఖ్యానిరచారు. దీనిపై మరిరతగా ఫోకస్‌ పెట్టాలని సూచిరచారు. ఈ రంగంలో ఎరత చేస్తున్నా కూడా ఇరకా చేయాల్సిరది చాలా ఉరటోరదన్నారు. ప్రధానంగా మార్కెట్‌ ఇరటలిజెన్స్‌ను బలోపేతం చేయాలని నిర్దేశిరచారు. జాతీయ, అరతర్జాతీయ మార్కెట్లకు రాష్ట్ర ఉత్పత్తులు ఎగుమతులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ఈ రంగంలో సుస్థిరత సాధించాలన్నారు. రబీ, ఖరీఫ్‌ పంటల కోసం 10 నురచి 15 ఏళ్లకు కావాల్సిన ప్రణాళికలు ఇప్పటి నురచే సిద్ధం చేసుకోవాలన్నారు. డిమారడ్‌ ఉన్న పంటలు, నీటి లభ్యత, ఫుడ్‌ ప్రాసెసిరగ్‌, సాంకేతికత వంటి అరశాలను అనుసరధానం చేసుకోవాలని సూచిరచారు. 2047కి నాటి రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకునేలా ప్రణాళికలు ఉరడాలన్నారు. సేవా రంగం ద్వారా జిbస్‌డిపి పెరుగుతురదని, అరదుకు పర్యాటకంపై ఎక్కువ దృష్టి పెట్టాలని, సూర్యలంక వంటి బీచ్‌లకు ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా చూడాలని నిర్దేశిరచారు.

పెట్టుబడులకు కలెక్టర్లే కీలకం
రాష్ట్రంలో పెట్టుబడులను విస్తృతం చేసేరదుకు కలెక్టర్లు కీలకంగా వ్యవహరిరచాలని చంద్రబాబు అన్నారు. ఎపిఐఐసిలో అరదుబాటులో ఉన్న భూమిపైనా చర్చిరచారు. అయితే, 82 వేల ఎకరాలు 22ఎ పరిధిలోకి వెళ్లిపోయాయని అధికారులు చెప్పగా, వాటికి సంబంధిరచిన సాంకేతిక అరశాలు అధ్యయనం చేయాలని, అవకాశం మేరకు ఈ భూముల వివరాలను మంత్రివర్గానికి కూడా సమర్పిరచాలని సిఎం సూచిరచారు. పెట్టుబడులకు చేసే భూ కేటాయిరపుల్లో తొలి ప్రాధాన్యర పర్యాటకశాఖకు ఇవ్వాలని, తరువాత ఐటి సంస్థలకు ఇవ్వాలని సూచిరచారు.

విశాఖ, విజయవాడల్లో భూ ట్రిబ్యునల్స్‌
పెట్టుబడులకు భూ సమస్యలు రాకుండా చూసేరదుకు విశాఖపట్నం, విజయవాడల్లో భూ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశిరచారు. ఒక కుటురబం, ఒక పారిశ్రామిక వేత్త లక్ష్యం సాధిరచేరదుకు ఎంఎస్‌ఎంఇలపై సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకం రంగంపైనా దృష్టి సారిరచి వచ్చిన వారికి భూమి ఇచ్చేరదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

జనవరి నుండి ఆకస్మిక తనిఖీలు
జనవరి నుండి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సిఎస్‌ విజయానంద్‌ స్వాగతోపాన్యాసం అనంతరం సిఎం మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే ప్రధానంగా ఈ తనిఖీలు ఉంటాయని చెప్పారు. 15 శాతం వృద్ధి లక్ష్యంగా పనిచేయాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. జిల్లాల్లో అనుసరించే బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ను ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేస్తూ లక్ష్యాలకు అనుగుణంగా 15 శాతం వృద్దిరేటు సాధించడమేమి కష్టం కాదని చెప్పారు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్‌ లాంటి అంశాల ద్వారా అనుకున్న లక్ష్యాల వృద్దిని సాధించాలన్నారు. ఇకపై రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌ ఉండాలన్నారు. పొలిటికల్‌ గవర్నెన్స్‌ అనేది కీలకమని, ప్రజాప్రతినిధుల సూచనలు అమలయ్యేలా చూడాలన్నారు.

ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లే బ్రాండ్‌ అంబాసిడర్లని, ప్రభుత్వం నిర్ధేశించిన పది సూత్రాలను పటిష్టంగా అమలు చేసి లక్ష్యాల సాధనలో భాగస్వామ్యులు కావాలన్నారు. పిపిపి విధానంలోనే ప్రభుత్వం వైద్యకళాశాలలను నిర్మిస్తామని, దీనివల్ల ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పారు. డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లక్ష్యాలను కలెక్టర్లు ముందుకు తీసుకెళ్ళాలన్నారు. పంచాయతీరాజ్‌ సిబ్బంది దేశంలోనే ప్రధమ స్ధానంలో నిలిచామని, కలెక్టర్ల చొరవతో పల్లె పండుగ 1.0ను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేశామన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నరేగా నిధులతో గతేడాది చేపట్టిన పల్లె పండుగ 1.0ద్వారా గ్రామాల్లో 4వేల కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్లు అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -