కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోతు కృష్ణ నాయక్
నవతెలంగాణ – నూతనకల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్య ప్రతి పౌరుడికి అందాలంటే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బక్క హేమల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుగులోతు కృష్ణ నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బక్క హేమల తండా ఆవాస ప్రాంతమైన బోటికింది తండాలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఇంకా గ్రామ సమగ్ర అభివృద్ధి చెందాలంటే తమ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



