Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

- Advertisement -

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ
నవతెలంగాణ – చిన్నకోడూరు 

అధికార పార్టీతోనే  గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. మంగళ మండల పార్టీ అద్యక్షుడు మీసం మహేందర్ ఆధ్వర్యంలో అల్లీపూర్ గ్రామానికి చెందిన నూతనంగా గెలిచినా ఉప సర్పంచ్ వార్డ్ మెంబెర్స్ తొ పాటు మాజీ సర్పంచ్, బి అర్ స్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు ఈ సందర్బంగా సిద్దిపేట పట్టణం లోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అంతేకాకుండా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, ప్రజాపాలనలో ప్రజలకు జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అధికారా పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరమన్నారు. పార్టీలో చేరినవారిలో అల్లీపూర్ ఉప సర్పంచ్ కోలన్ పాక శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కామ నిలయ్య బుజ్జమ్మ, వార్డ్ మెంబెర్లు మంకాళి మహేష్, మీసం ఎల్లవ్వ పోచయ్య,BRS మండల యస్ సి సెల్ మాజీ అధ్యక్షులు ఎర్ర బాలయ్య, లింగంపల్లీ రాజయ్య,brs యూత్ నాయకులు ఎర్ర అజయ్ లు పార్టీ లో చేరినారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట కౌన్సిలర్లు సాకి ఆనంద్, పయ్యావుల ఎల్లం యాదవ్, సిద్దిపేట 31వ వార్డ్ ఇంచార్జ్ పయ్యావుల సందీప్ యాదవ్, మైనార్టీ రాష్ట్ర నాయకులు కలిమోద్దీన్,అల్లీపూర్ సర్పంచ్ కాంటెస్టేడ్ కాండిడేట్ మహంకాళి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు పిల్లి బాబు,ఇర్మల్ల ముత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -