- Advertisement -
ప్రతి ఒక్కరు చదువుకోవాలి: ఎంఈఓ విజయ్ కుమార్
నవతెలంగాణ – జన్నారం
చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదువుకోవాలని, జన్నారం మండల ఎంఈఓ విజయ్ కుమార్ అన్నారు. శనివారం జన్నారంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వాలంటీర్లకు ఉల్లాస్ పథకంపై అవగాహన కల్పించారు. పాఠశాల విద్యకు దూరంగా ఉన్న వారిని అక్షరాస్యులను చేయడమే ఉల్లాస్ పథకం లక్ష్యమన్నారు. అలాంటి వారిని గుర్తించి అక్షరాస్యులుగా మార్చాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీచర్లు పాల్గొన్నారు.
- Advertisement -