Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపీపీపీ విధానంలో 27 టూరిస్టు ప్రాంతాల అభివృద్ధి

పీపీపీ విధానంలో 27 టూరిస్టు ప్రాంతాల అభివృద్ధి

- Advertisement -

– అంతర్జాతీయ కార్నివాల్‌ ఏర్పాటుకు చర్యలు
– బ్రాండింగ్‌, ప్రమోషన్‌పై దృష్టి పెట్టండి : పర్యాటక శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 27 టూరిస్టు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీటీడీసీ) కార్యాలయంలో ఆ సంస్థ చైర్మెన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డితో కలిసి రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్థిపై సమీక్ష నిర్వహించారు. టూరిస్టు ప్రాజెక్ట్‌ పనుల స్థితిగతులు, బడ్జెట్‌ హౌటళ్లు, పెండింగ్‌ పనులు, మొదటి దశలో కొత్తగా చేపట్టబోయే ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలను గుర్తించి. టూరిజం డెస్టినేషన్‌ సెంటర్లుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడి పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రయివేటు హౌటళ్లు, ట్రావెళ్లకు ధీటుగా ఆదాయం పెంచుకోవాలి. బోనాలు, బతుకమ్మ, సమ్మక్క-సారాలమ్మ, నాగోబా జాతరలను ఘనంగా నిర్వహించడం ద్వారా దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఇక్కడికే రప్పించేలా చర్యలు తీసుకోవాలి” అని అదికారులకు సూచించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివాల్‌ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్‌ నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందించాలని జూపల్లి ఆదేశించారు. వాటర్‌ స్పోర్ట్స్‌లో సాహస క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలనీ, అవసరమేతై ఇతర రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేయాలన్నారు. జాతీయ రహదారుల్లో వే సైడ్‌ అమ్నిటీస్‌ కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో షార్ట్‌ సే కోసం గ్లాపింగ్‌ టెంట్స్‌, మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. టూరిజంపై బ్రాండింగ్‌, ప్రమోషన్‌ పై ఫోకస్‌ చేయడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. అధికారులు రిజల్ట్‌ ఓరియటెండ్‌ గా పని చేసి ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు.సమీక్షలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీజీటీడీసీ మేనెజింగ్‌ డెరెక్టర్‌ వల్లూరు క్రాంతి ఇతర అధికారులు పాల్గోన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -