Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

బీఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలం గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లో బీఆర్ఎస్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతన గ్రామపంచాయతీ అభ్యర్థులు మండలంలో 20 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించినట్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పోలగౌని వెంకటేష్ గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మాట్లాడుతూ…కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మండలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులే దర్శనమిస్తుంది తప్ప కాంగ్రెస్ నాయకులు చేసిందేమి లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మోసపూరిత హామీలు తప్ప అభివృద్ధి లేదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని విధాలుగా కష్ట పడి పార్టి బలపర్చిన అభ్యర్ధిల గెలుపు కోసం కష్ట పడి పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గూదే బాల నరసయ్య,మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి,సర్పంచ్ బుడమ వెంకటేష్, నాయకులు కట్ట శ్రీకాంత్ గౌడ్,కొండోజు ఆంజనేయులు, పాచ్చ నాయక్, మాజీ ఉపసర్పంచ్ భరత్, రాజు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -