Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ తోనే అభివృద్ధి: ఎంపీ చామల

కాంగ్రెస్ తోనే అభివృద్ధి: ఎంపీ చామల

- Advertisement -

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
నవతెలంగాణ – భువనగిరి
: కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని ఆ ప్రాంత అభివృద్ధి  జరుగుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు తెలిపారు. గురువారం పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి హెచ్ఎండిఏ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తీర్చుతూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. 

గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలు కనీసం ఇంటి నిర్మాణాలు చేయలేకపోయారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే  ఉచిత విద్యుత్తు,  మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, కొత్త రేషన్ కార్డులు, రైతులకు పంట పెట్టుబడి, ఇందిరమ్మ నిర్మాణం నిధులు మంజూరు చేశామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, మురుగు కాలువలు, డ్రైనేజీ, ఫుట్పాతులు,  విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. 

జిల్లాలో వేగవంతంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఎక్కడ అవినీతికి చోటు లేకుండా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. మురుగు కాలువలు,  అండర్ గ్రౌండ్ డ్రనేజీ, రోడ్ల విస్తరణ, సిసి రోడ్లకు,  హెచ్ఎండిఏ నిధులు కేటాయించారు. రూ. 50 లక్షలతో 9 వ వార్డు సింగన్నగూడెంలో 10 & 26 వార్డు బహార్ పేట మరియు హౌసింగ్ బోర్డ్  కాలనీలలో హెచ్‌ఎండీఏ నిధుల ధ్వారా మంజూరైన రూ 50లక్షలు,  8వ వార్డు లంద గుట్టలో హెచ్‌ఎండీఏ నిధులు రూ.27.5 లక్షలు,  28వ వార్డులో రూ. 10.5 లక్షలు, 12వ వార్డులో హెచ్‌ఎండీఏ నిధుల ధ్వారా మంజూరైన సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, గ్రేవ్ యార్డ్ పనులకు రూ. 81.37 లక్షలు, 27,29,30 & 33 వ వార్డులలో  రూ. 1కోటి 59 లక్షలు  1, 15వ వార్డు అర్బన్ కాలనీలో రూ. 60 లక్షల  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్   అవేస్ చిస్తి,  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్ నాయకులు ఈరపాక నరసింహ, పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, మహాలక్ష్మి ధర్మశాల కమిటీ చైర్మన్ మంచి కంటి కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -