Saturday, July 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి

అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి

- Advertisement -

జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రభుత్వ అబివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయా లనీ, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర సమాచార. పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.ప్రియాంక అన్నారు. గురువారం నాంపల్లి మీడియా అకాడ మీలో రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల శిక్షణ తరగతుల ముగింపులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ జర్నలిస్టుల ప్రయోజనం కోసం అవసరమైన సౌకర్యాలను అందించ డంలో మీడియా అకాడమీ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. అకాడమీకి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. పాత రోజుల్లో వార్తలను అందించే పద్ధతి చాలా కష్టంగా ఉండేదనీ, కానీ ఇప్పుడు వాట్సాప్‌, సోషల్‌ మీడియా ద్వారా వార్తల సమాచారం అందరికీ సెకన్లలో చేరుతుందని గుర్తుచేశారు. ఎప్పటికప్పుడు ప్రజల మధ్య జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు అందించ డంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైన దన్నారు. ఈ సమాజంలో నిజాలను నిక్కచ్చింగా, నిజాయితీగా తెలియజే యాలన్నారు. అకాడమీ ద్వారా మరణించిన జర్నలిస్టుల కుటుంబా లకు పెన్షన్‌ అందించడం, వారికి సహాయం చేయడం వల్ల చాలామంది పిల్లల చదువుకు గొప్ప ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుందన్నారు. వారికి సంబంధించిన బీమా పథకంలో ఉన్న లోపాలను సరిదిద్ది సక్రమంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుం టామని ఆమె అన్నారు. విధుల్లో ఉండి ప్రమాదాల్లో గాయపడి పని చేయలేని వారికి ఆర్థిక సహాయం అందిస్తామ న్నారు. ప్రభుత్వం అనేక ఇతర సంక్షేమ పథకాలను అందిస్తున్నదనీ, ప్రభుత్వం తన శాఖ ద్వారా జర్నలిస్టు లకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. అనంతరం పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.
180 మంద జర్నలిస్టులకు ఆర్థికసాయం : శ్రీనివాసరెడ్డి
మీడియా అకాడమీ చైర్మెన్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రమాదాలకు గురై పని చేయలేని 180 మంది జర్నలిస్టుల కుటుంబా లకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు అకాడమీ రూ. 3 వేల పెన్షన్‌ అందిస్తుందని చెప్పారు. వారి పిల్లల ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు చదువుకు అవసరమైన ఫీజు లను అకాడమీ చెల్లిస్తుందని చెప్పారు. ఈ అకాడమీ ద్వారా ఎడిటర్లు, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు, సెమినార్లు నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. ఇప్పటివరకు, నాలుగు జిల్లాల్లో శిక్షణ తరగతులు, సెమినార్‌లు నిర్వహించామన్నారు. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్‌. వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ప్రజా సంబంధాల అధికారి పీసీ వెంకటేశం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -