కాంగ్రెస్ పార్టీ నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు : పల్లెల అభివృద్ధి,ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిది జంపయ్య నాయక్, మాజీ ఎంపిపి ఐస్నపు రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్, ఆయన అనుచరులు మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కిషన్ రావు పల్లి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తే మాజీ ఎమ్మెల్యే పుట్ట, బిఆర్ఎస్ నాయకులు అవగాన లేని, అర్ధరతమైన వ్యాఖ్యలు చేస్తూ,ఎస్సి, ఎస్టీలను రెచ్చగొట్టే, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలనే దిశగా ఎన్నో పోరాటాలు చేసిన కాంగ్రెస్ నాయకులను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి లబ్ది పొందినవారు కండువా మార్చి కాంగ్రెస్ నాయకులపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి సవేందర్,యూత్ నాయకుడు రాహుల్,కిషన్ నాయక్,రఘు,రాజయ్య,కేశారపు చెంద్రయ్య, రాజునాయక్,సంపత్ పాల్గొన్నారు.
అభివృద్ధి.. సంక్షేమం శ్రీధర్ బాబుతోనే సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES