Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం!

మద్నూర్ మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం!

- Advertisement -

 మహిళ సంఘాల భవనాలు, సీసీ రోడ్లకు భూమి పూజలు

నవతెలంగాణ మద్నూర్

మద్నూర్ మండలంలోని దన్నూర్, సోమూర్, శేఖపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 10 లక్షల రూపాయల నిధులతో మహిళ సంఘాల భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి శంఖుస్థాపన నిర్వహించారు. అలాగే దన్నూర్, శేఖపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా భూమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ పెద్దపీట వేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, దన్నూరు గ్రామ సర్పంచ్ జయశ్రీ, శాఖాపూర్ గ్రామ సర్పంచ్ తుకారం, సోమూరు గ్రామ సర్పంచ్ సంగ్రామ్ పటేల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్ సాయిలు, మద్నూర్ సొసైటీ మాజీ  చైర్మన్ కొండ గంగాధర్, ప్రకాష్, సుదర్శన్, ఈరన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -